ఎప్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం... పరిశ్రమల ద్వారా పెద్దఎత్తున ఉపాధి
హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్స్ లెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. చిన్న పరిశ్రమల ఎదగడానికి సహకారం అందిస్తున్నామని, పరిశ్రమల ద్వారా పెద్దఎత్తున ఉపాధి కల్పన జరుగుతోందని పేర్కొన్నారు. విజయం ఎప్పుడూ యువతలో స్ఫూర్తిని నింపుతుందని, తెలంగాణపై నమ్మకం ఉంచి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, పెట్టుబడులు పెడుతున్న పరిశ్రమలకు శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రం అభివృద్ధి పథంలో పరిశ్రమలు భాగస్వామ్యం అవుతున్నాయని, పరిశ్రమలకు అవకాశాలతో పాటు పెద్ద సవాళ్లు ఎదురవుతాయని వెల్లడించారు. విజయవంతమైన పారిశ్రామికవేత్తల యాత్ర స్ఫూర్తిదాయకమని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచంలో మార్పులు వేగవంతమైనయని తెలిపారు. కొత్త సాంకేతికతలు అందిపుచ్చుకుని ముందుకు సాగాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.






