29 July, 2026 | 1:02 AM

దళితులు అన్ని రంగాల్లో ఎదగాలి

29-07-2026 12:00 AM

కాంగ్రెస్ జిల్లా ఎస్సీ ఫోరం అధ్యక్షుడు పసుల రాజు

బాలానగర్ జులై 28: దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ జిల్లా ఎస్సీ ఫోరం అధ్యక్షుడు పసుల రాజు అన్నారు. మండల కేంద్రంలోని బాలానగర్ ఫంక్షన్ హాలులో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్థాయి ఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కార్పొరేషన్ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.

గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంలో దళితులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఐకమత్యంతో ముందుకు సాగితేనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్థాయి ఎస్సీ నాయకులకు నియామక పత్రాలను అందజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్, సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, టీపీసీసీ సమన్వయకర్త దత్తాత్రేయ, పలుగుమీది తాండ సర్పంచ్ కుమార్ నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.