10 April, 2026 | 3:23 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి

10-04-2026 01:32 PM

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన దేపంగి శ్రీకాంత్ వీరకుమారి దంపతుల ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని లబ్ధిదారులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. లబ్ధిదారులు కొత్త ఇంటిలో అడుగుపెడుతూ సంతోషం వ్యక్తం చేయగా, మంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేసి, వారి భవిష్యత్తు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎదులాపురం మున్సిపల్ చైర్మన్ పోక బత్తిని అనిత,నేలపట్ల సర్పంచ్ శోభన్ బాబు, అగ్రహరం సర్పంచ్ మల్లెల స్వాతి--ఉపేందర్,ఆత్మ కమిటీ డైరెక్టర్ రాణి--రామరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానికులు పాల్గొనడం జరిగింది