23-02-2026 04:30:25 PM
సిఐటియు నుంచి ఐఎఫ్టియులో భారీగా చేరికలు
ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం కడం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ వర్కర్లు సిఐటియు నుండి ఐఎఫ్టియులో భారీగా చేరుతున్నారని ఆ శాఖ జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్ అన్నారు. ఈ మేరకు సోమవారం కడం మండలంలో కార్మికుల పక్షంగా ఆయన మాట్లాడారు.
కాగా గ్రామపంచాయతీ వర్కర్లకు చాలీచాలని వేతనాలు ఇవ్వడంతో వారి బ్రతుకులు చిద్రమవుతున్నాయని కనీస వేతనం 26,000 ఇవ్వాలని ,ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను ప్రభుత్వం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, మండలాధ్యక్షులు గొర్రె నరేష్, ఉపాధ్యక్షులు రామడుగు లక్ష్మణ్, మిరియాల మహేష్ ,ప్రధాన కార్యదర్శి శనిగారపు రాజన్న ,మంగి గణపతి, రమేష్ ,పోశం , శ్రీనివాస్, మొగిలి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.