calender_icon.png 23 February, 2026 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యసభ సీటు బీసీలకే ఇవ్వండి

23-02-2026 04:28:03 PM

* సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీనీ కాపాడుతుంది.

బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్

హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం నుండి మార్చి నెలలో భర్తీ జరిగే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీసీకి, ఇంకోటి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కులగనన జరగాలని కుల గణాంకాల ఆధారంగా జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కలన్న రాహుల్ గాంధీ మాటలు దేశంలోని 90 కోట్ల మంది బహుజనులకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి.

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కూడా మీ మాట అమలు జరిగితేనే దేశమంతా మిమ్మల్ని విశ్వసిస్తుంది, ముఖ్యంగా మీరు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేసే దిశగా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది, సామాజిక న్యాయము అమలే దేశంలో కాంగ్రెస్ పార్టీని అగ్ర భాగాన నిలబెడుతుంది.

ఈ వాస్తవాన్ని మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నా, ప్రస్తుతం మార్చ్ నెలలో భర్తీ చేయబోయే రెండు రాజ్యసభ స్థానాలలో ఒకటి బీసీలకు ఇంకొకటి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాo, రాజ్యసభ సీటు బడుగులకు అస్తిత్వం అయితే, అగ్రకుల ధనవంతులకు అలంకారం లాంటిది. పెద్దల సభకు పేదల అస్తిత్వం కోసం పోరాడే వారిని పంపించాలే కానీ, రాజ్యసభ సీటును అడ్డం పెట్టుకొని స్కాములు చేసే గద్దలకు అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యాన్ని కునీ చేస్తారని అన్నారు. అదే బడుగులకు రాజ్యసభ సీటు మీరు కేటాయిస్తే తెలంగాణలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంట్లో అమలు చేయాలని పోరాడుతారు.

మీరు అగ్రకుల ధనవంతులకు అవకాశం కల్పిస్తే రాజ్యసభ సీటుతో డిల్లీ పాలకులతో రాజీ పడి సొంత లాభం కోసం రాజ్యసభ సీటును వ్యాపారంగా మలుచుకుంటారు, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుండి అగ్రకులాలకు వారి జనాభా దామాషా కంటే చట్టసభలలో 60% అధికంగా ప్రాతినిధ్యం పొందుతున్నారు, పార్లమెంటులో కూడా అగ్రకులాల వారే అత్యధికంగా 80 శాతం ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ సీట్లు అగ్రకులాలకు కేటాయిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. 90 శాతం ఉన్న బహుజనుల గొంతు చట్టసభల్లో వినిపించదు.

తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం సుదీర్ఘకాలంగా జీవితాంతం పనిచేస్తున్న వారు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందులో అగ్రగన్యులుగా బీసీల పితామహుడుగా వి. హనుమంతరావు, తెలంగాణ కోసం పార్లమెంట్ లో గళం విప్పిన పోరాడిన మధు యాస్కి గౌడ్ లాంటి వాళ్ళు ముందు వరసలో ఉన్నారు. ఇలాంటి వారికి మీరు రాజ్యసభ అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  బీసీల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నo. లేదంటే అగ్రకుల ధనవంతులకు, వ్యాపారస్తులకు, అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అధోగతి పాలవక తప్పదని వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు.