26 May, 2026 | 1:23 AM

ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలి

26-05-2026 12:29 AM

ముషీరాబాద్, మే 25 (విజయక్రాంతి): పాత పెన్షన్ కేవైసీ అప్డేట్ కోసం తహసిల్దార్  కార్యాలయం వద్ద బారులు తీరిన ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. పాత పెన్షన్ లబ్దిదారులకు కేవైసీ అప్డేట్ చేయాలనే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు  మండల రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజలు భారీగా బారులు తీరార న్నారు.

ఈ మేరకు సోమవారం  ముషీరాబా ద్ ఎమ్మార్వో కార్యాలయంలో వందల సం ఖ్యలో చేరుకున్న గాంధీనగర్ డివిజన్ ప్రజలు ప్రత్యేకంగా వృద్ధులు తమకు కనీస సౌకర్యాలు కల్పించండం లేదని, మండుటెండలో నిరసించి పోతున్నామని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్  ఎ.పావని వినయ్‌కుమా ర్‌కు ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకు ఎ.వినయ్ కుమార్ ముషీరాబాద్ మండల కార్యాలయానికి చేరుకొని అక్కడి ప్రజలతో మాట్లాడారు.

అనంతరం ఎంఆర్‌ఓ రాణా ప్రతాప్ సింగ్,  డిప్యూటీ తహసీల్దార్  చందనతో ప్రజల అవస్థలపై నిలదీశారు. మండల కార్యాలయం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ లలో కెవైసి అప్డేట్ ప్రక్రియ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

గాంధీనగర్ డివిజన్‌లోని పెన్షనర్‌లకు డివిజన్‌లోని జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని వినయ్‌కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, సాయికుమార్, జ్ఞానేశ్వర్  పాల్గొన్నారు.