26 May, 2026 | 1:23 AM

అక్రమ నాలా నిర్మాణాన్ని నిలిపివేయాలి

26-05-2026 12:27 AM

ఎల్బీనగర్, మే 25: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నాలా నిర్మాణాన్ని నిలిపివేయాలి బీజేపీ సీనియర్ నాయకుడు, ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్‌చార్జి సామ రంగారెడ్డి డిమాండ్ చేశారు. లింగోజిగూడ డివిజన్‌లోని జనప్రియ అపార్ట్మెంట్స్ వద్ద అక్రమంగా నిర్మిస్తున్న డ్రైనేజి నాలాను సోమవారం బీజేపీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. ఐదేండ్ల క్రితం సరైన స్ట్రామ్ వాటర్ నాలా లేకపోవడంతో వరదనీరు ఇళ్లలోకి చేరి లింగోజిగూడ డివిజన్ పరిధిలో దాదాపు 40 కాలనీలు నీట మునిగాయన్నారు.

ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుం డా గ్రావిటేటీషనల్ ప్రవాహంతో  జనప్రియ అపార్ట్మెంట్స్ నుంచి తపోవన్ కాలనీకి మధ్యన నాలా నిర్మించినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి అక్రమ నాలా నిర్మాణాని ఆపాలని డిమాండ్ చేశారు. లేకుంటే జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీవాణి, బీజేపీ నాయకులు కృష్ణం రాజు, మల్కాగిరి కుమార్, మల్కాజ్గిరి నాగరాజు, నోముల సంతోష్ గౌడ్, శ్రీనివాస్, కాకి గంగాధర్, సాయి నగర్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్, జనప్రియా కాలనీ ప్రెసిడెంట్ ఆంజనేయులు, విజయ్ భాస్కర్ పాల్గొన్నారు.