వంతెనకు మోక్షం.. ప్రజల హర్షం..
తాళ్ల మల్కాపురంలో రూ.6.90 కోట్లతో కొత్త వంతెన నిర్మాణం
రెండు జాతీయ రహదారులను కలుస్తుండడంతో తీరనున్న ప్రజల కష్టాలు
గరిడేపల్లి, మే 25: గరిడేపల్లి మండలంలోని తాళ్ల మల్కాపురం గ్రామ శివారులో కీతవారిగూడెం - మునగాల ప్రధాన రహదారిపై ఎట్టకేలకు నూతన వంతెన నిర్మాణానికి మోక్షం లభించింది. తాళ్ల మల్కాపురం గ్రామ శివారులో ఉన్న పురాతనమైన వంతెనతో కొన్ని సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో ఏమాత్రం పెద్ద వర్షం కురిసిన ఈ వంతెన పైనుంచి వరద ప్రవాహం వెళ్ళేది.
దీంతో ఈ రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగేది. రెండు జాతీయ రహదారులను కలిపే ఈ రహదారి సుమారు 10 నుంచి 20 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిం దంటే ఈ వంతెన పైనుంచి ఎప్పుడు వరద వస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంటుంది.
వంతెనపై నుంచి వరద వస్తే ఇక ట్రాఫిక్ కు అంతరాయం కలిగినట్లే. ఈ వంతెనపై వరద ప్రవహిస్తున్న సమయంలో దాటేందుకు ప్రయత్నం చేసిన పలువురు గల్లంతైన సంఘటన కూడా ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం నూతన వంతెన నిర్మాణానికి నిధులు మం జూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రెండు జాతీయ రహదారులను కలిపే రోడ్డు :
గరిడేపల్లి మండలం ఎన్హెచ్ 167 జాతీయ రహదారి నుంచి తాళ్లమొల్కాపురం గ్రామం మీదుగా మునగాల వద్ద ఎన్ హెచ్ 65 జా తీయ రహదారిని కలుపుతుంది. ఈ రహదారి వెంట కీతవారిగూడెం, తాళ్ల మల్కాపు రం, రంగాపురం, రేగుల గడ్డ తండా, వెలిదండ, కొక్కిరేణి, తిమ్మారెడ్డి గూడెంతో పాటు చుట్టుపక్కల అనేక గ్రామాలు ఉన్నాయి.
ఇటీవల ఈ రహదారిని కొత్తగా రెండు లైన్ల రోడ్డుగా మార్చారు. ఈ వంతెన నిర్మాణం పూర్తి అయితే రెండు జాతీయ రహదారులను కలిపే ఈ రహదారి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనంగా మారనుంది. పురాతనమైన వంతెనను పూ ర్తిగా కూల్చివేసి నూతన వంతెన నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు.
వారం రోజులుగా ముమ్మర పనులు
గత వారం రోజులుగా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా పక్కనే అప్రోచ్ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం వాహనదారులు ప్రజలు ఈ అప్రోచ్ రోడ్డు ద్వారా వంతెనను దాటుతున్నారు. రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో ఈ వంతెన నిర్మాణం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల కష్టాలు తొలగినట్లే. ప్రభుత్వం ప్రత్యేక వంతెనల నిర్మాణం కోసం నిధులను కేటాయించడంతో ఆరు కోట్ల 90 లక్షలతో ఈ నూతన వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలిపా రు. ఈ వంతెన నిర్మాణానికి మోక్షం లభించడంతో ప్రయాణానికి అనేక గ్రామాల ప్రజల సమస్యలు తీరనున్నాయి.
ఇబ్బందులు తొలగిపోతాయి
తాళ్లమొల్కా పురం గ్రామ శివారులో కీతవారిగూడెం మున గాల ప్రధాన రహదారిపై నూతన వంతెన నిర్మించడం హర్షించాల్సిన విషయం. పాత వంతెనతో కొన్ని సంవత్సరాలుగా ప్రజలు అనే ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో ఏమాత్రం పెద్ద వాన కురిసిన పైనుంచి వరద వెళ్ళేది. దీంతో ట్రాఫిక్ అంతరాయం జరిగేది. నూతన వంతెన నిర్మాణం వల్ల ప్రజల ఇబ్బందులు మొత్తం తొలగిపోతాయి.
రాతికింది అంజయ్య గౌడ్ తాల్లమల్కాపురం






