సొసైటీ సీఈఓకు ఘన సన్మానం
26-05-2026 01:22 AM
కేసముద్రం, మే 25 (విజయక్రాంతి): కేసముద్రం మండల దనసరి సొసైటీ సీఈవో మల్లారెడ్డిని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సీఈవో వజీర్ సుల్తాన్, జీ ఎం ఉష, డీ జీ ఎం అశోక్ సోమవారం ఘనంగా సన్మానించారు. 42 ఏళ్ల పాటు సహకార సంస్థలో విశిష్ట సేవలు అందించి, దనసరి సొసైటీని వాణిజ్య బ్యాంకు తరహాలో రూపొందించి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక పర్యాయాలు ఉత్తమ ప్రశంసలు అందుకొని ఈ నెలలో పదవి విరమణ చేస్తున్న సందర్భంగా సీఈఓ సేవలను అభినందిస్తూ సత్కరించారు.






