26 May, 2026 | 1:23 AM

సద్గురు బందాయప్ప స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే

26-05-2026 12:29 AM

నిజాంసాగర్ మే 25( విజయ క్రాంతి)బిచ్కుంద పీఠాధిపతి, పరమ పూజ్యులు సోమలింగ శివాచార్య మహారాజ్ (బండాయప్ప )జన్మదిన సందర్భంగా సోమవారం రోజు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు బిచ్కుంద మండల కేంద్రంలోగల బండాయప్ప మఠానికి వెళ్లి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మహారాజ్ ఆశీస్సులు స్వీకరించి, వారు సమాజంలో ఆధ్యాత్మిక విలువలు, సేవాభావం పెంపొందించడంలో చేస్తున్న కృషిని ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు కొనియాడారు. ఆయురారోగ్యాలతో, ఆనందంతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు భక్తి భావాన్ని పంచాలని,ఆకాంక్షించారు. ఆయన వెంట ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భుజం గారి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.