9 April, 2026 | 3:11 AM

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

09-04-2026 01:20 AM

జడ్చర్ల, ఏప్రిల్ 8: ఇచ్చిన మాట ప్రకారంగా ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇచ్చే పరిహారాన్ని రూ.18 లక్షలకు పెంచి ఇప్పించి నందుకు ధన్యవాదాలు చెబుతూ ఉదండాపూర్ కు చెందిన గ్రామస్తులు బుధవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తమ పట్ల చూపిన ప్రమాభిమానాలకు తాము ఎప్పుడూ రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉదండాపూర్ సర్పంచ్ తంగెళ్లపల్లి శేఖర్, డిప్యుటీ సర్పంచ్ మ్యాతరి నరేష్, వార్డు సభ్యులు జహంగీర్, జ్యోతి శేఖర్, సుధారాణి లింగం గౌడ్ పార్టీ నేతలు జడ్చర్ల మల్లయ్య, పాతింటి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.