9 April, 2026 | 3:13 AM

మహిళ,శిశు సంక్షేమానికి ప్రభుత్వం కృషి

09-04-2026 01:21 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బుధవారం మధురానగర్ లోని ప్రజా కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గం లోని 140 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది హాజరు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని ఆన్లైన్లో నమోదు చేయడానికి స్మార్ట్ ఫోన్లను సక్రమంగా వినియో గించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో గంగాధర ప్రాజెక్ట్ సిడిపివో సల్వాజి నర్సింగారాణి, గంగాధర తాసిల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో రాము, అంగన్వాడి సూపర్వైజర్లు సంతోషి, రేణుక, సుధారాణి, మస్రత్, మిషన్ వాత్సల్య సామాజిక కార్యకర్త కవిత దేవి, తదితరులు పాల్గొన్నారు.