08-02-2026 01:25:01 AM
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కొత్తపల్లి, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): రేకుర్తి డివిజన్‌లో నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలపై పోరాటం చేస్తామని మాజీ మం త్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. శనివారం నగరంలోని 19, 20 డివిజన్లలో ప్రచారంలో మాట్లాడారు. కమలం వాడిపోయిందని, కాంగ్రెస్ చేయి విరిగిపోయిందని.. కారు దూసుకు వెళ్తుందన్నారు. రాబోవు రోజుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. గత పదేళ్ల కాలం లో 19, 20 డివిజన్లలో అభివృ ద్ధి చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు.
మేయర్ పీఠం గులాబీ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కరీంనగర్ అభివృద్ధికి రెండు రూపాయలు కూడా తేలేదని విమర్శించారు. 19 డివిజన్ లో కార్పొరేటర్‌ను గెలిపిస్తే నిషేధిత జాబితాలో ఉన్న రేకుర్తి భూములపై సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేస్తామన్నారు. అభ్యర్థి సుదగోని మాధవి కృష్ణ గౌడ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.