29 June, 2026 | 1:54 AM

30 నుంచి ఏరోమార్ట్ హైదరాబాద్ 2026

29-06-2026 01:23 AM

జూలై 2 వరకు హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ సదస్సు

విమానయానం, రక్షణ రంగాల్లో దిగ్గజ కంపెనీల సమావేశం

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): విమానయానం, రక్షణ రంగాల్లో దిగ్గజ కంపెనీలు ఒక చోట సమావేశమవుతున్నాయి. ఈ నెల30 నుంచి జూలై 2 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ హెచ్‌ఐసీసీ లో ‘ఏరోమార్ట్ హైదరాబాద్ 2026’ పేరుతో అంతర్జాతీయ సదస్సు జరగనుంది.

విదేశీ కంపెనీలు, వాటికి విడిభాగాలు సరఫరా చేసే భారతీయ సంస్థలు ఇక్కడ కలుసుకుని, కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటాయి. ప్రపంచంలో విమానయాన తయారీ రంగం లో వేగంగా ఎదుగుతున్న దేశాల్లో భారత్ ఒ కటిగా మారింది. ఈ సదస్సుకు 25 దేశాల నుంచి 400కు పైగా కంపెనీలు, 1,200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారు. విమానాలు, విమాన విడి భాగాలు తయా రు చేసే పెద్ద కంపెనీలకు, వాటికి సామగ్రి సరఫరా చేసే చిన్న-మధ్య తరహా కంపెనీలకు మధ్య సమావేశాలు జరుగుతాయి.

ఈ సదస్సు వల్ల భారతీయ చిన్న-మధ్య తరహా కంపెనీలకు మంచి అవకాశం వస్తుంది. వాళ్లు నేరుగా విదేశీ కంపెనీల కొనుగోలు అధికారులతో సంప్రదింపులు జరిపి, తమ సామర్థ్యాన్ని ప్రదర్శించి, వారి సరఫరా వ్యవస్థలో భా గం కావచ్చు. విదేశీ కంపెనీలకు కూడా ఇది మంచి అవకాశం ఎందుకంటే భారత్లో నాణ్యమైన సరఫరాదారులను వెతుక్కోవడానికి ఇదొక సులభమైన మార్గం. భేటీలతో పాటు, విమానయాన తయారీ భవిష్యత్తు, సరఫరా వ్యవస్థలు, కొనుగోలు పద్ధతులు, డిజిటల్ టెక్నాలజీల గురించి చర్చా గోష్టులు కూడా ఈ సదస్సులో జరుగుతాయి.

ఈ సదస్సును అడ్వానస్డ్ బిజినెస్ ఈవెంట్స్ (ఏబీఈ), బీసీఐ ఏరోస్పేస్ సంస్థలు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రైజింగ్, టీజీఐఐసీ సహకారంతో నిర్వహిస్తున్నాయి.ఈ సదస్సు ద్వారా కొత్త పెట్టుబడులు రావడంతో పాటు, భారతీయ కంపెనీలకు ప్రపంచ స్థాయి వ్యాపార అవకాశాలు మరింత పెరుగుతాయి. తెలంగాణ పేరు ప్రపంచ విమానయాన రంగంలో మరింత వినిపిస్తుంది.   కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్‘ పేరుతో దేశీయంగా ఉత్పత్తిరంగాన్ని విస్తృత ప ర్చేందు కు చర్యలు తీసుకుంటోంది. రక్షణ సా మాగ్రిని కూడా ఎక్కువగా దేశంలోనే త యారు చేయడం, విమానయాన రంగం విస్తరించ డం, ఎగుమతులు పెరగడం వంటి కారణాలతో విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తి కోసం భారతీయ సంస్థలవైపు చూస్తున్నాయి.