28 June, 2026 | 10:23 PM

ఐఎమ్‌టి హైదరాబాద్ లో ముగిసిన అభ్యుదయ 2026

28-06-2026 09:22 PM

హైదరాబాద్, 27 జూన్ 2026: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎమ్‌టి), హైదరాబాద్ తమ మేనేజ్‌మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, అభ్యుదయ 2026ను మేనేజ్‌మెంట్ విద్యార్థుల నుండి పరిశ్రమ అంచనాలు: మీ బి-స్కూల్ ప్రయాణాన్ని అత్యుత్తమంగా మలచుకోవడం” అనే ఇతివృత్తంతో జరిగిన ముగింపు ప్యానెల్ చర్చా కార్యక్రమంతో ముగించింది. ఈ చర్చా కార్యక్రమంలో బెర్కాడియా ఇండియా వైస్ ప్రెసిడెంట్ & హెడ్ హెచ్‌ఆర్ అనుకుల్య పాండా; ఐక్యూఈక్యూ గ్లోబల్ సర్వీసెస్ ఇండియా కంట్రీ డెలివరీ డైరెక్టర్ నవీన్ రాజ్‌దేవ్; ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ - కార్పొరేట్ సెంటర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్   ఐషిక్ భట్టాచార్య; జౌల్స్‌టువాట్స్ బిజినెస్ సొల్యూషన్స్ లిమిటెడ్ సీటీఓ  వినీత్ శుక్లా; మరియు ఏఎమ్‌ఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  సునీల్ పునియాతో సహా పలువురు ప్రముఖ పరిశ్రమ నాయకులు పాల్గొన్నారు.

కార్పొరేట్ రిలేషన్స్ ఆఫీస్ హెడ్ ప్రకాష్ పాఠక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చ, సాంకేతికత ఆధారిత వ్యాపార వాతావరణంలో భవిష్యత్ మేనేజ్‌మెంట్ నిపుణుల నుండి సంస్థలు ఆశిస్తున్న అంశాలపై దృష్టి సారించింది. కార్పొరేట్ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన పటిష్టమైన పునాదులు, నిరంతర అభ్యాసం, ఏఐ యొక్క బాధ్యతాయుతమైన వినియోగం, మరియు అనుకూలత యొక్క కీలక ప్రాముఖ్యతను ఈ సమావేశం లోతుగా పరిశీలించింది. తక్షణ ప్రతిఫలం కంటే అభ్యాసానికి, సంస్థాగత అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వాలని నీల్ పునియా విద్యార్థులను ప్రోత్సహించారు. ఏఐని ఒక ప్రత్యామ్నాయంగా కాకుండా, ఒక సాధికారిక సాధనంగా చూడాలని శ్రీ వినీత్ శుక్లా విద్యార్థులను కోరారు. సాంకేతికతను విమర్శనాత్మక ఆలోచన , అర్థవంతమైన మానవ సంబంధాలతో కలపడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

వ్యాపారాన్ని అర్థం చేసుకోవడానికి, పటిష్టమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, మరియు వినియోగదారు-కేంద్రీకృత మనస్తత్వాన్ని నిర్మించుకోవడానికి అమ్మకాలను ఒక కీలకమైన పునాదిగా చూడాలని విద్యార్థులను ప్రోత్సహిస్తూ, పునాది పాత్రల విలువను ఐషిక్ భట్టాచార్య  చెప్పారు. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ అంచనాలపై జరిగిన చర్చ సందర్భంగా, శ్రీమతి అనుకుల్య పాండా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జిసిసిల) వేగవంతమైన విస్తరణను ప్రముఖంగా ప్రస్తావించారు. విద్యార్థులు వివిధ రంగాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, సమాచార సేకరణకు మద్దతుగా ఏఐ ని ఉపయోగించుకోవాలని సూచించారు.