30 August, 2026 | 9:43 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక

29-06-2026 01:52 AM

ఘట్కేసర్, జూన్ 28 (విజయక్రాంతి) : పోచారం డివిజన్ పరిధిలోని  డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది. గౌరవ అధ్యక్షులుగా సెగ్గ్యం శ్రీనివాసులు, అధ్యక్షులుగా ఎంకర్ల రవికుమార్, ఉపాధ్యక్షులుగా కట్కూరి కమలాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా గంధసిరి నాగరాజు, జాయింట్ సెక్రటరీలుగా దేవరుప్పల శ్రీనివాస్, అన్నం సంతోష్ రెడ్డి, ట్రెజరర్ గా మంచాల శ్రీనివాసరావు, కో-ట్రెజరర్‌గా బంకి శ్రీధర్ నాయుడు,

ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పి. అశోక్,  బి. నాగరాజు, ఎ. వేణు, సీహెచ్. నాగేంద్ర రెడ్డి, పి. రమణారెడ్డి, ఎస్. విజయ వాసు, వి. శ్రీనివాస్, బి. మంగ్యా, అడ్వైజర్లుగా డాక్టర్ . జి. నరేందర్, పి.సాంబశివరెడ్డి, కె. శ్రీనివాస్, పి. చంద్రశేఖర్ రెడ్డి, కె. సురేందర్ రెడ్డి. ఎన్నికయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాలనీ వాసులకు, జనరల్ బాడీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్స్ కాలనీ సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల నివాసుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. కాలనీలో నివసించే ప్రతి సభ్యుడు ఎదుర్కొనే సమస్యలు, సూచనలు మరియు అభివృద్ధికి సంబంధించిన అంశాలను నూతన కమిటీ సభ్యుల దృష్టికి తీసుకురావాలని కోరారు.