మెడికవర్ అత్యాధునిక కంటి వైద్య కేంద్రం
హైటెక్ సిటీలో ప్రారంభించిన సినీ నటి అమల అక్కినేని
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్‌లో సమగ్ర కంటి వైద్య సేవలను అందించే అత్యాధునిక అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించింది. ప్రముఖ సినీ నటి, సామాజిక సేవకురాలు అమల అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఐ సెం టర్‌లో కాటరాక్ట్, రెటినా, రిఫ్రాక్టివ్, కార్ని యా, న్యూరో-ఆఫ్తాల్మాలజీ సేవలను ఒకే చో ట అత్యాధునిక సాంకేతికతతో అందుబాటులోకి తీసుకువచ్చారు. అనుభవజ్ఞులైన నేత్ర వైద్య నిపుణుల బృందం ద్వారా సేవలను ఈ కేంద్రం అందించనుంది.
అమల అక్కినేని మాట్లాడుతూ.. ప్రజలకు అత్యాధునిక కంటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్న మెడికవర్ హాస్పిటల్ ప్రయ త్నాన్ని అభినందించారు. ఈ కేంద్రంలో ప్ర త్యేక రెటినా, విట్రియో-రెటినల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెటినా లేజర్ చికిత్సలు, ప్రీమేచ్యూర్ శిశువుల్లో వచ్చే రెటినోపతి ఆఫ్ ప్రీమ్యాచ్యూరిటీ చి కిత్స, డయాబెటిక్ విట్రెక్టమీ, రెటినల్ డిటాచ్మెంట్ శస్త్రచికిత్సలు, యువియాటిస్ ని ర్వ హణ, కాటరాక్ట్ శస్త్రచికిత్స అనంతర సమస్య ల చికిత్సలు ఉన్నాయి.
అలాగే క్లిష్టమైన కంటి-నర సంబంధిత సమస్యలకు న్యూ రో ఆఫ్తాల్మాలజీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్ ప్రారం భం ద్వారా తెలంగాణతో పాటు పొరుగు రా ష్ట్రాల ప్రజలకు అత్యాధునిక, నా ణ్యమైన, అందుబాటు ధరల్లో కంటి వైద్య సేవలను అందించాలనే తమ లక్ష్యాన్ని మ రింత బలోపేతం చేస్తున్నామన్నారు. డా. జ్యోత్స్నా మైనేని (సీనియర్ కన్సల్టెంట్ రెటి నా అండ్ యువియాటిస్), డా. హరినాథ్ బాబు కార్లపూడి (కన్సల్టెంట్ ఆఫ్తాల్మాలజి స్ట్), డా. కోటేశ్వర ప్రసాద్ వీరగంధం (సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్), డా. రా మ కృష్ణ రావూరి (హెడ్ అన స్తీషి యాలజీ వి భాగం), మహేష్ డెగ్లూర్కర్ (చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్), డా. జానకిరామ్ (రీజినల్ డైరెక్టర్), శ్రీకాంత్ (సెంటర్ హెడ్) పాల్గొన్నారు.






