23 May, 2026 | 7:05 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

05-12-2025 12:27 AM
  1. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు

‘విజయక్రాంతి‘ ఎఫెక్టుతో ఆసుపత్రి పరిశీలన

కన్నాయిగూడెం,డిసెంబర్4(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి గురించి ‘విజయక్రాంతి‘ పత్రికలో ‘డాక్టర్ లేక కన్నాయిగూడెం ప్రభుత్వ ఆస్పత్రి‘ అని వచ్చిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు.ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశానుసారము జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించినారు.

కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి డిఎం అండ్ హెచ్‌ఓ మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని,లేనియెడల సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకోబడతా యని సిబ్బందిని హెచ్చరించారు.

ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగులకు డ్యూటీ రోస్టర్ వేసి దాని ప్రకారంగా ప్రతి ఒక్క ఉద్యోగి విధినిర్వహణ నిర్వహించాలని రికార్డులను రిజిస్టర్ లను పరిశీలించి పెర్ఫార్మన్స్ పనితీరును మెరుగుపరుచుకోవాలని అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను 100% చేయాలని తెలిపారు. సమావేశ అనంతరం ఆరోగ్య కేంద్రంలోని మం దుల గదిని ఇన్ పేషెంట్ వార్డులను సందర్శించి వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి అడిగి తెలుసుకుని,ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ శ్రీకాంత్ కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మధుకర్,డాక్టర్ గిరిబాబు,హెల్త్ ఎడ్యుకేటర్ సుజాత సూపర్వైజర్ రమణ కుమారి మరియు కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మేల్ అండ్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్ పాల్గొన్నారు.