26 February, 2026 | 6:28 AM

తెలంగాణ పోలీస్ క్రీడల్లో ములుగు పోలీసు క్రీడాకారులకు పతకాలు

26-02-2026 12:34 AM

ములుగు, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): సైబరాబాదులో ఫిబ్రవరి 16నుండి 21వరకు నిర్వహించిన 4వ తెలంగాణ పోలీస్ క్రీడా పోటీల్లో ములుగు జిల్లా పోలీస్ సిబ్బంది విశిష్ట ప్రతిభ కనబరిచి పతకాలు సాధించా రు. ఈ క్రీడా పోటీల్లో ములుగు జిల్లా నుంచి పాల్గొన్న వారిలో ఇద్దరు పోలీస్ సిబ్బంది అమిత్ కుమార్ సింగ్ రెజ్లింగ్ కుస్తీ పోటీల్లో 63కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. మేకల నాగరాజు జూడో 81 కేజీల భా గంలో సిల్వర్ మెడల్, 82కిలోల కుస్తీ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. బుధవా రం రోజు ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఇద్దరు విజేతలను అభినందించారు.