8 May, 2026 | 2:11 AM

అధికార పీఠమే లక్ష్యం

08-05-2026 01:10 AM
  1. ప్రధాని మోదీ రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు 
  2. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న ద్రోహులు కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలు 
  3. పాలమూరు ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా ప్రధాని మోదీ రాష్ట్రానికి రాబోతున్నారని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రా వాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈనెల 10న సికింద్రాబాద్‌లో నిర్వహించే సభకు మోదీ రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. గురువారం బీజేపీ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మా ట్లాడారు.

అసోం, బెంగాల్, పుదుచ్చేరిలలో బీజేపీ గెలిచిందని, పశ్చిమ బెంగాల్ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారు కోసం బీజేపీని గెలిపించారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రాన్ని గెలుస్తోందన్నా రు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ, తన మిత్రపార్టీలు మహిళా ద్రోహులుగా నిలిచాయని మండిపడ్డారు. మొన్న జరిగిన ఎన్నికల్లో డీఎం కే, టీఎంసీలకు మహిళలు తగిన గుణ పాఠం చెప్పారని అన్నారు.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ. 2,500, విద్యార్థునులకు స్కూటీలు ఇవ్వలేదని, ఆరు గ్యారెంటీలను మర్చిపోయిందని విమర్శించారు. రైతు భరోసా సరిగ్గా వేయకుండా అంతా మోసమే చేస్తున్నారని రైతులు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. కొత్త పింఛన్లు లేవు, గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూ రు చేయడంలేదని, కొత్త రైల్వే లైన్లు, జా తీయ రహదారులు ఇవన్నీ కేంద్రమే ఇస్తోందని వెల్లడించారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర మంత్రులు ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రానికి ఎలాంటి భేదాభిప్రా యాలు లేకుండా నిధులు కేంద్రం ఇస్తోందని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కేంద్రం ఇచ్చిందని, వికసిత భారత్ దిశగా అడుగులు కేంద్ర ప్రభుత్వం అడుగులు వే స్తోందన్నారు. మోదీ సభకు 3 లక్షల మంది హాజరయ్యేలా జనసమీకరణకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు, కార్యకర్తలకు డీకే అరుణ పిలుపునిచ్చారు.