భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కమెడియన్ రాకింగ్ రాకేష్
26-02-2026 12:35 AM
వరంగల్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ప్రసిద్ధిగాంచిన వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని బుధవారం జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ స్టార్ రాకేష్ సుజాత దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారు ముందుగా వల్లభ గణపతిని దర్శించుకొని, అనంతరం అమ్మవారి సన్నిధిలో నిర్వ హించిన పూజలు పాల్గొన్నారు.
స్వప్న మం డపంలో భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో పండితు లు వేద ఆశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రాన్ని మహాప్రసాదాన్ని రాకేష్ దంపతులకు అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త తోనుపునూరి వీరన్న పాల్గొన్నారు.




