బహుజన ఐక్యతతోనే సామాజిక న్యాయం
- మాజీ డీజీపీ డాక్టర్ జే పూర్ణచంద్రరావు
- బామ్‌సెఫ్ ఆధ్వర్యంలో టిప్పుసుల్తాన్ సంస్మరణ సభ
కర్నూలు, మే 7(విజయక్రాంతి): బ్రిటిష్ వలసవాదానికి తొలి సవాల్ విసిరిన యో ధుడు టిప్పుసుల్తాన్ అని మాజీ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. బామ్‌సెఫ్ ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహించిన టి ప్పుసుల్తాన్ సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. టిప్పుసుల్తాన్ కేవలం ఒక రాజు మాత్రమే కాదని, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎదురు నిలిచిన ధైర్యవంతుడని కొనియాడారు.
సైని క సాంకేతికత, వ్యవసాయం, పరిపాలన రం గాల్లో సంస్కరణలు చేపట్టి భారత చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. కేరళలో దిగువ కులాల మహిళలపై అమలైన వివక్షతను అరికట్టేందుకు టిప్పుసుల్తాన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. బ్రా హ్మణ పీష్వాలు, నిజాం బ్రిటిష్‌తో చేతులు కలిపి టిప్పుసుల్తాన్‌ను ఓడించారని ఆరోపించారు.
దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు సంఖ్యాపరంగా మెజారిటీ అయినప్పటికీ రాజకీయంగా ఐక్యంగా లేకపోవడం వల్ల అధికారానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బహుజన’ భావన బౌద్ధ తత్వంలోని ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ సిద్ధాంతం నుంచి వచ్చిందని, మ హాత్మా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్, కాన్షీరాం వంటి మహనీయులు దీని కి సామాజిక, రాజకీయ దిశనిచ్చారని వివరించారు.
రాయలసీమ రాజకీయాల్లో ఆధిప త్య కులాల ప్రాబల్యం కొనసాగుతోందని, బీసీలు, ముస్లింలు, ఎస్టీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదని విమర్శించారు. 63 ఎమ్మెల్యేలు ఉన్న రాయలసీమ నెల్లూ రులో కేవలం ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు 8 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని కనీసం 5 ముస్లిం ఎమ్మెల్యేలు 30 పైగా బీసీ ఎమ్మెల్యే లు ఉండాలని అన్నారు.
బహుజన వర్గా ల ఐక్యత కోసం బామ్‌సెఫ్ విస్తృత స్థాయిలో చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డా. హరిప్రసాద్, డా. సుబ్రమణ్యం, నక్కలమిట్ట శ్రీనివాసులు, పట్నం రాజేశ్వరి, శేషపాణి, పెరికల రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం
భారతదేశ రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి దా మోదరం సంజీవయ్య ఆశయాల సాధనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింల ఐక్యత అత్యవసరమని ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డా. జే పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. దామోదరం సంజీవయ్య మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.
దేశ రాజకీయ చరిత్రలో దళిత వర్గానికి చెందిన వ్యక్తి సీఎం స్థాయికి ఎదగడం గొప్ప విషయమని, కానీ పాలక కుల రాజకీయ శక్తులు సంజీవయ్యని రాజకీయంగా ఒంటరిచేసి ఆయన ఎదుగుదలను అడ్డుకున్నాయని అన్నారు. సంజీవయ్య సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రస్తుతం రాయలసీమ నెల్లూరు రాజకీయాలలో రెడ్డి ఆధిపత్యం కొనసాగుతోందని, 63 అసెంబ్లీ స్థానాలలో ప్రతి ఎన్నికలో 30 నుంచి 40 మంది వరకు రెడ్డి ఎమ్మెల్యేలు గెలుస్తున్నారన్నారు.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, బీసీలకు, ముస్లింలకు శాసనసభల్లో రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, రాయలసీమలో ఎస్టీలకు శాసనసభల్లో రిజర్వేషన్లు రాజకీయ అవకాశాలు కల్పించే అంశాలపై ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అదే దామోదరం సంజీవయ్యకి నిజమైన నివాళి అవుతుందన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా ప్రసంగించారు. బహుజన నాయకులు జేవీ కృష్ణయ్య యాకోబు, నక్కలమిట్ట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్ర మాన్ని దామో దరం సంజీవయ్య మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ కమిటీ, దామోదరం సంజీవయ్య సోదరుని కుమారుడు రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించింది.






