బీఆర్ అంబేద్కర్ మహనీయుడు:మంత్రి వివేక్
నాగోల్, మే 7 (విజయ క్రాంతి): మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన మార్గం దేశ నిర్మాణానికి శాశ్వత మార్గదర్శకమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. నాగోల్ బండ్లగూడలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) కాంప్లెక్స్లో ఆల్ ఇండియా జీఎస్‌ఐ షెడ్యూల్ క్యాస్ట్, ట్రైబల్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో జీఎస్‌ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ విజయ్ విష్ణు పంత్ మొగల్, డీఐసీసీఐ ఉమెన్స్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ అరుణ దాసరి, సత్యనారాయణ మహాపాత్రో, బొంతు అజయ్ కుమార్, దీపక్ హజ్రా, కె.వి. మారుతి, ఎం.ఎం. ప్రవీణ్, అజయ్ నిర్వాన్, శైలేందర్ సింగ్ తదితరులు హాజరయ్యారు.






