ఖమ్మం నడి బొడ్డున భారీ చోరీ
సోనివిజన్ షోరూమ్ లో రూ. 67 లక్షల సొత్తు అపహారణ
టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరం లో షో రూమ్
ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడిన దొంగలు
హ్యాండ్ కి గ్లౌజ్లు , పేస్ కి మాస్క్, హెడ్ కి కాప్
ఖమ్మం టౌన్, జూన్ 11 (విజయక్రాంతి): ఖమ్మంకి నడి బొడ్డున, పాత కలెక్టరేట్ కి సమీపంలో, టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరం, ఎప్పుడు వాహనాలు తిరిగే ప్రదేశంలో దొంగలు పడ్డారు. క్లూస్ టీం కి కూడా చిన్నపాటి ఆధారాలు దొరకకుండా పని కానిచ్చారు.
హ్యాండ్ కి గ్లౌజ్లులు, పేస్ కి మాస్క్, హెడ్ కి కాప్ పెట్టుకొని దర్జాగా గురువారం వేకువ జామున 4 గంటలకి పని కానిచ్చి, రూ 67 లక్షల విలువ చేసే 160 సెల్ ఫోన్ లను దొంగిలించారు. వివరాల్లోకి వెళ్తే.... ఖమ్మం వైరా రోడ్ లోని సోనివిజన్ లో గురువారం ఉదయం 4 గంటల సమయంలో దొంగలు పడి రూ. 67 లక్షల విలువ చేసే ఖరీదైన 160 సెల్ ఫోన్ లను దొంగిలించారు.. షాప్ తాళాలు పగలగొట్టి ఆధారాలు దొరకకుండా దొంగతనం చేశారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సి పి సునీల్ దత్ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. షాప్ వారి నుండి వివరాలు సేకరించారు. క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది, పోలీసులు ఆధారాల కోసం సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ కరుణాకర్ విజయక్రాంతితో మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఖమ్మం ఏసీపీ రమణ మూర్తి సూచనలతో ఆధారాలు సేకరిస్తున్నామని తొందరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.






