11 July, 2026 | 1:59 AM

నాసిరకం సోయా విత్తనాలు.. మొలకెత్తని గింజలు

11-07-2026 12:43 AM
  1. నాసిరకం సోయా విత్తనాల కలకలం
  2. ఆదిత్య ట్రేడింగ్ కంపెనీ ఘరానా మోసం!
  3. మొలకెత్తని గింజలు.. 
  4. మోసపోయిన సిద్ధాపూర్, కల్దుర్కి గ్రామాల రైతులు
  5. వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసిన బాధితులు

బోధన్,జూలై10 (విజయ క్రాంతి): బోధన్ మండలం పరిధిలోని సిద్దాపూర్ కల్దుర్కి, ఖడ్గుం, తదితర గ్రామాల్లో నాసిరకం సోయా విత్తనాల విక్రయం కలకలం రేపింది. ఓ ట్రేడింగ్ కంపనీ నాసిరకం విత్తనాలు అంటగట్టడంతో రైతులు బేజారు అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని సిద్దాపూర్ గ్రామంలోని ’ఆదిత్య ట్రేడింగ్ కంపెనీ యజమాని నాసిరకం విత్తనాలను అంటగట్టడంతో రైతులు తీవ్రంగ

నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతు...

నష్టపోయారు. తొలికరి వర్షాలు పడగానే ఆశగా దాదాపు 45 ఎకరాల్లో పైగా సోయా విత్తనాలు చల్లినప్పటికీ, రోజులు గడుస్తున్నా మొలకలు రాకపోపడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై ట్రేడింగ్ కంపెనీ యజమానిని నిలదీ యగా... ఆయన బాధ్యతారాహిత్యంగా, దురుసుగా ప్రవర్తించాడు.

దీంతో దిక్కుతోచని రైతులు బోధన్ మండల వ్యవసాయ అధికారి (ఏవో) సంతోష్ కు ఫిర్యాదు చేశారు. నాసిరకం విత్తనాలు విక్రయించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. దీనిపై ఏవో స్పందిస్తూ.. పంటలను పరిశీలించి, సమగ్ర విచారణ జరిపిబాధ్యుల పై శాఖాపరమైన చర్య లు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.