17 April, 2026 | 3:06 PM

మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు

17-04-2026 01:39 PM

జిల్లా కలెక్టర్ కె .హరిత 

ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి పనులకు శంకుస్థాపన 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): మండలంలోని కుమ్రం భీం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా  మాణిక్ గూడ గ్రామానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె .హరిత అన్నారు.ఫిబ్రవరి నెలలో మాణిక్ గుడా గ్రామ సందర్శన సమయంలో జిల్లా కలెక్టర్ దృష్టికి గిరిజనులు పలు సమస్యలను తీసుకువెళ్లడంతో పాటు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా తమ గ్రామానికి ఉందని వివరించారు.స్పందించిన కలెక్టర్ నివేదికలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించడంతో రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు.దాదాపు 46 లక్షల రూపాయలతో రక్షణ గోడకు శుక్రవారం కలెక్టర్ ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు ద్వారా గ్రామానికి ఎలాంటి నష్టం జరగకుండా శాశ్వత చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ముంపు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ గోడ పునర్నిర్మాణ పనుల ద్వారా గ్రామానికి తలెత్తుతున్న భూమి కోత సమస్య తీరడమే కాకుండా, భవిష్యత్తులో ప్రాజెక్టు ముంపు నుండి గ్రామస్తులకు పూర్తి రక్షణ లభిస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ ఈ గుణవంతురావ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.