1 May, 2026 | 9:36 PM

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవాలు

01-05-2026 08:20 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మే డే సందర్బంగా దమ్మపేట మండలంలోని లింగాలపల్లి, గొర్రెగుట్ట, గండుగలపల్లి, ముత్తయిగూడెం, జమేదారుబంజర్, గురవాయిగూడెం, పార్కలగండి, చిల్లగుంపు, పాకలగూడెం, కొత్తూరు, జగ్గారం, బాలరాజుగూడెం, దమ్మపేట లోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, టి యు సి ఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన మేడే కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము మాట్లాడుతూ... ప్రపంచ దేశాలలో జరుగుతున్న దురాక్రమణ యుద్ధ భారాలకు వ్యతిరేకంగా, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కై ఉద్యమిద్దామని రాము అన్నారు.

1886 లో చికాగో నగరం లో కార్మిక హక్కులకై పోరాడుతూ 8 గంటల పని దినం అమలు చేయాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని, పని స్థలాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, పెట్టుబడిదారుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన రోజే మేడే అని 1886 సం||లో మే 1న శ్రామిక వర్గ, కార్మిక వర్గ పోరాట దినంగా పాటించాలని ఆనాటి కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కార్మిక నాయకుల త్యాగంతో, రక్త తర్పణతో ఎరుపక్కిన జెండానే సుత్తి కొడవలి జెండా, కార్మిక జెండా. ఆ పోరాట ఫలితమే | ప్రపంచవ్యాప్తంగా నేడు 8 గంటల పని దినం అమలు అవుతున్నదని అన్నారు. ఆ పోరాట అమరవీరుల  అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేడు కార్మిక వర్గంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పని భారానికి, పని గంటల పెంపుకి, శ్రమ దోపీడీకి వ్యతిరేకంగా ఉద్యమించాల అన్నారు.