1 May, 2026 | 9:35 PM

కార్మికులకు కనీస వేతనం ముప్పై వేలుగా నిర్ణయించండి

01-05-2026 08:23 PM

కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు అమలుపరచండి

తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ బాబు

జవహర్ నగర్,(విజయక్రాంతి): కార్మికులందరికీ కనీస వేతనం 30 వేలుగా ప్రభుత్వం నిర్ణయించాలని, వారికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ అండ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివ బాబు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మేడే దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ బాలాజీ నగర్ లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ అండ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి శివబాబు ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శివ బాబు హాజరై మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు కట్టు బానిసత్వంలోకి నెట్టి వేయబడ్డారని తెలిపారు. ఇకనైనా కార్మికులకు కనీస వేతనం 30000 ఇవ్వాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా కార్మికులను గుర్తించాలని డిమాండ్ చేశారు.