కాళోజీ కళా క్షేత్రంలో భారీ జాబ్ మేళా.. 4,000 మందికి ఉపాధి అవకాశాలు
నిరుద్యోగులకు మంత్రి కొండా సురేఖ పిలుపు
హనుమకొండ, మే 8 (విజయ క్రాంతి): ప్రజా పాలన ప్రగతి 99 రోజుల ప్రణాళిక’లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ జాబ్ మేళాను యూత్ అండ్ స్పోరట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం కాళోజి కళ క్షేత్రంలో టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.కాళోజీ కళ క్షేత్రంలో నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చింది.వేలాది సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళా లో పాల్గొన్నారు.
ఈ జాబ్ మేళా కి ముఖ్యఅతిథిగా అటవీ దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు రిటైర్డ్ ఐపీఎస్ , జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ జాబ్ మేళా ప్రాముఖ్యతను, సామాజిక బాధ్యతను జాబ్ మేళాకు వచ్చిన యువతీ యువకులకు వివరించారు.
జాబ్ మేళా గతంలో కూడా నిర్వహించడం జరిగిందని, అది విజయవంతంగా సుమారు 11,600 మంది నిరుద్యో గులు ఎంపికయ్యారని, సుమారు 30 లక్షల రూపాయల సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినట్లు మంత్రి కొండా సురేఖ గుర్తుచేశారు. మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత వరంగల్ ప్రాంతంలోని మహిళలకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్వాహకులను కోరారు.
హైదరాబాద్ వంటి నగరాల్లో హాస్టల్ వసతి, భద్రత పరమైన ఇబ్బందులు దృష్ట్యా, మహిళలకు వరంగల్ లోనే అవకాశం కల్పించడం శ్రేయస్కరమని అన్నారు. 10వ తరగతి నుంచి ఉన్నత చదువులు చదివిన వారందరికీ ఈ మేళాలో 72 కంపెనీల ద్వారా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు వెంటనే ఆర్డర్ కాపీలు అందజేయడం జరుగుతుందని, వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి కూడా త్వరలోనే అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సంధర్భంగా ఎంపీ కడియం కావ్య కానీ వరంగల్లో 72 కంపెనీలలోని నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి అన్నారు. ఈ మేళా ద్వారా ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి వివిధ రంగాల్లో సుమారు 4,000 ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ, వైవి గణేష్, వరంగల్ ఆర్డీవో సుమ, డిబిసిడివో పుష్పలత, వరంగల్ రంగల్ వరంగల్ తాసిల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్ , యూత్ అండ్ స్పోరట్స్ అధికారి రమేష్, సీఎం ఇండస్ట్రియల్ నరసింహమూర్తి, మెప్మా రేణుక, డి ఎం సివిల్ సప్లై సంధ్యారాణి, బీసీ ఎస్‌ఓ కిష్టయ్య, సంబంధిత అధికారులు,పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు.






