30 April, 2026 | 5:11 AM

కామారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

30-04-2026 02:38 AM

కామారెడ్డి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం చిన్న ఎక్లారా, షేకాపూర్ గ్రామాల్లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.

ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో సుమారు వందల ఎకరాల్లో మొక్కజొన్న, వరి, జొన్న పంటలు అగ్నికి ఆహుత య్యాయి. స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక శకటాలు, సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.