25 August, 2026 | 12:00 AM

27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ

24-08-2026 11:23 PM

మహబూబ్ నగర్,(విజయ క్రాంతి): ఉద్యోగుల వేతన సవరణ (పి అర్ సి), డి ఏ ల విడుదల, సిపిఎస్ రద్దు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు నిర్వాహణ తదితర 29 డిమాండ్లపై తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహిస్తున్నామని ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగిరాకపోతే దశలవారి పోరాటాలను నిర్వహిస్తామని, సిపిఎస్ రద్దు కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

సోమవారం టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన జేఏసీ సమావేశంలో టీజీజేఏసి చైర్మన్ రాజీవ్ రెడ్డి కన్వీనర్,  టీజీవో అధ్యక్షులు విజయ్ కుమార్,  జేఏసీ నాయకులు చంద్ర నాయక్, ఎన్ వెంకటేష్, ఎన్ కిష్టయ్య, నరసింహులు గౌడ్, శ్యాంబాబు, రాములు, మురళి, చంద్రకాంత్, హిరాలాల్, వెంకట్రామారెడ్డి, కృష్ణమోహన్, కృష్ణ కాంత్, మహేశ్వర్ రెడ్డి, మహిళా ప్రతినిధులు దివ్య, ప్రియాంక, ఎం వేణుగోపాల్, గోపిశంకర్ తదితరులు సమావేశం లో పాల్గొన్నారు.