25 August, 2026 | 1:17 AM

ఆర్‌ఎంపీ, పీఎంపీల సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడికి సన్మానం

25-08-2026 12:00 AM

గణపురం, ఆగస్టు 24 (విజయ క్రాంతి): గణపురం నూతన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి భాస్కరరావును ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ మండల అధ్యక్షుడు దౌడు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యుడు చోటేబియా, ఉపసర్పంచ్ ఒరంగంటి కృష్ణ గౌడ్, బీసీ సంఘం జిల్లా నాయకుడు శివశంకర్గౌడ్లను ఈ సందర్భంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి సహకరించాలని నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కూతురు రమణ, వైనాల వెంకటేశ్వర్లు, దూలం కుమార్, నడిగోట్టి రాములు, అన్వర్, అజ్మత్, వోడపల్లి భాస్కర్, సాంబశివుడు, అంజి తదితరులు పాల్గొన్నారు.