రాహుల్‌కు యువతి ముద్దు
రాహుల్‌గాంధీకి ఓ విద్యార్థిని ముద్దుపెట్టింది. ఊహించని ఈ ఘటనకు సంబంధించిన దశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రలోని పుణెలో ‘ఛాత్రోం కీ గూంజ్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ యువతతో మాట్లాడారు.
అనంతరం పలువురు విద్యార్థులతో సెల్ఫీలు దిగుతూ వారితో ముచ్చటించారు. అదే సమయంలో ఓ విద్యార్థిని రాహుల్‌తో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఆయన చెంపపై ముద్దుపెట్టుకుంది. దీంతో రాహుల్ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆ విద్యార్థినితో కొద్దిసేపు మాట్లాడి, భద్రతా సిబ్బందితో కలిసి వేదిక నుంచి వెళ్లిపోయారు. కాగా, తాను 11వ తరగతి చదువుతున్నానని, తన పేరు మరియం అని తెలిపిన ఆ విద్యార్థిని.. రాహుల్‌గాంధీ తనకు స్ఫూర్తి అని పేర్కొంది.






