24 August, 2026 | 11:59 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి

24-08-2026 11:20 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నేరాల దర్యాప్తులో పోలీసులకు సకాలంలో సహకరించిన వీఎస్టీ కాలనీ అధ్యక్షుడు అజెండ్ల సుధాకర్‌ను ఉప్పల్ ఏసీపీ వేంకట్ రెడ్డి అభినందించారు. నాచారం వీఎస్టీ కాలనీలో నమోదైన క్రైమ్ నం. 407/2026 కేసు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీ అందించి నిందితుడిని గుర్తించడం, అరెస్టు చేయడం, కేసు ఆస్తుల రికవరీలో సహకరించినందుకు ఆయనకు మల్కాజిగిరి కమిషనరేట్ తరఫున ప్రశంసా పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏసీపీ వేంకట్ రెడ్డి మాట్లాడుతూ.... నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రతి కాలనీలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వల్ల పోలీసు దర్యాప్తు మరింత వేగవంతంగా సాగుతుందని అన్నారు. సమాజ భద్రత కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాచారం సీఐ ధనంజయ్ గౌడ్, డీఐ మాన్‌సింగ్, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఫ్రాన్సిస్, ప్రభాకర్ రెడ్డి, మైబెల్లీ తదితరులు పాల్గొన్నారు. ప్రజా భద్రతకు సహకరించిన అజెండ్ల సుధాకర్ సేవలను అధికారులు ప్రశంసించారు.