ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
25-08-2026 12:00 AM
కేసముద్రం, ఆగస్టు 24 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని ఉప్పరపల్లి గ్రామ సర్పంచ్ ఏర్పుల సునీత కుమారస్వామి అన్నారు. గ్రామంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ అడవులను నరికి వేయడం వల్ల వర్షాలు ఉరవడం లేదని, పర్యావరణానికి హానికరంగా మారిందని, తిరిగి అడవులను పెంచడం వల్ల ఉష్ణోగ్రతల తగ్గి వర్షాలు పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవుల ఐలయ్య ,వార్డు సభ్యులు జెనిగల అనిల్ కుమార్, కంచ రాజు కుమార్, తండ సంపత్ కుమార్, మంద ప్రవీణ్, టెక్నికల్ అసిస్టెంట్ మధు బాబు,ఫీల్ అసిస్టెంట్ మంచాల కుమార్,వి బి జి రామ్ కూలీలు పాల్గొన్నారు.






