డాక్యతాండలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు
22-08-2026 02:43 PM
పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు
పాపన్నపేట,ఆగస్టు22: మండల పరిధి డాక్యా తాండాలోని శ్రీ జగదాంబ మాత సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరం(Sri Jagadamba Mata Sant Sevalal Maharaj Temple) వద్ద శనివారం తండాలోని మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పూజారులు తులసీరామ్, ప్రభువా నాయక్ ఆధ్వర్యంలో ఆయా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్బంగా సర్పంచి స్వప్న హీరాలాల్ మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పశుసంపద వృద్ధి చెందాలని వేడుకున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో తాండ పెద్దలు హీరాలాల్, రవి, హరిలాల్, రాజు, రామచందర్, సక్రు తదితరులు పాల్గొన్నారు.






