calender_icon.png 9 February, 2026 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి క్షణికావేశ నిర్ణయం.. ఇద్దరు పసికందుల ప్రాణాలకు అపాయం

09-02-2026 03:53:58 PM

దేవరకొండ,(విజయక్రాంతి): చింతపల్లి మండలం ఉమ్మంతలపల్లి గ్రామంలో గుండెలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన జబ్బు శిరీష అనే మహిళా తీవ్ర నిర్ణయం తీసుకుంది. తనకు సొంత ట్రాక్టర్ ఉండటంతో దానికి కావాల్సిన డీజిల్ కూడా ఇంట్లోనే అందుబాటులో ఉంది. ఆ డీజిల్‌ను ఒంటిపై పోసుకుని ఆమె నిప్పు అంటించుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆమె వద్దే ఉన్న మూడేళ్ల కుమారుడు, ఏడు నెలల చిన్నారి కల్పన కూడా మంటల ధాటికి గురై తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే స్పందించి వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిరీష పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆమెను హైదరాబాద్‌కు తరలించగా, ఇద్దరు చిన్నారులను దేవరకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ నుండి హైదరాబాద్ ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయం ఇద్దరు పసికందుల ప్రాణాలను ప్రమాదంలో పడేయడం స్థానికులను కలచివేసింది.