13 May, 2026 | 4:44 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

01-12-2025 01:21 AM

అత్తింటివారి వేధింపులే కారణం?

నాగిరెడ్డిపేట్, నవంబర్ 30 (విజయక్రాంతి): వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. ధర్మారెడ్డి గ్రామానికి చెందిన కమ్మరి లక్ష్మి, కమ్మరి వినోద్‌లకు ఏడేళ్ల కిత్రం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వినోద్ కుమార్ గత మూడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ తర్వాత వినోద్ కుమార్ పేరున ఉన్న బీమా, ఆస్తి డబ్బుల కోసం భర్త తరఫున బంధువులతో గొడవలు జరిగాయి.

గాంధారిలో పెద్దల సమక్షంలో కుదిర్చడం తో లక్ష్మిని తల్లిదండ్రులు ఈ నెల 24వ తేదీ న అత్తిల్లు అయిన ధర్మారెడ్డిలో ఉంచారు. ఆ తర్వాత కూడా ఆస్తి, బీమా డబ్బుల విషయంలో లక్ష్మితో అ త్తింటివారు గొడవ పడడంతో లక్ష్మి మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. మృతురాలు తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు.