108 మంది మావోయిస్టుల లొంగుబాటు
12-03-2026 01:29 AM
ఛత్తీస్‌గఢ్ డీజీపీ ఎదుట సరెండర్
చర్ల, మార్చి 11 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్‌లో ఆ రాష్ట్ర డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ ఎదుట బుధవారం 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. బస్తర్ డివిజన్ కేంద్రమైన జగదల్పూర్‌లో డీజీపీ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. లొంగిపోయిన మావో యిస్టులకు ప్రభుత్వం నుండి అందే అన్ని సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గత 26 నెలల్లో 2,714 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వెల్లడించారు.




