25 April, 2026 | 3:42 AM

మావోయిస్టు ప్లాటూన్ మెంబర్ లొంగుబాటు

25-04-2026 02:17 AM

ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్చార్జ్, 9వ ప్లాటున్ మహిళ కమాండర్  విజ్జాలు అలియాస్ ఐతూ ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సమక్షంలో శుక్రవారం లొంగిపోయారు. ములుగు జిల్లా పోలీసు అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన ‘పోరు కన్నా ఊరు మిన్న , మన ఊరికి తిరిగి రండి’ అనే కార్యక్రమం ఫలితంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ కల్పిస్తున్న పునరావాస సదుపాయాల గురించి తెలుసుకొని, మావోయిజాన్ని విడిచిపెట్టి ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన పార్టీ సభ్యురాలు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం దేశంలో అత్యుత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తూ, జనజీవన స్రవంతిలో కలిసిన వారికి నగదు రివార్డు, వైద్య సేవలు, పునరావాస సహాయం, సమాజంలో తిరిగి స్థిరపడటానికి పూర్తి మద్దతు ఆమెకు అందిస్తామని తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న కొంతమంది మావోయిస్టు సభ్యులను జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన మహిళ మావోయిస్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరెండర్ పాలసీలో భాగంగా 25 వేల రూపాయలను తక్షణ పునరావాస ఆర్థిక సహాయం ఎప్పి అందజేశారు.