calender_icon.png 20 February, 2026 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్మాది ఘాతుకం

20-02-2026 12:00:00 AM

  1. ప్రేమించిన యువతిపై సుత్తెతో దాడి
  2. తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం
  3. నిందితుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు
  4. సూర్యాపేట జిల్లాలో ఘటన

సూర్యాపేట, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ఓ ఉన్మాది తాను ప్రేమించిన యువతి దూరం పెడుతోందని కక్ష పెంచుకుని ఆమెపై ఇనుప సుత్తెతో దాడిచేశాడు. యువతి కేకలు వేయడంతో నిందితుడిని స్థానికులు పట్టుకుని స్తం భానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. తీవ్రగాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘట న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్నేహనగర్ ప్రాంతంలో గురువారం జరిగింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెంది న బోయిండ్ల మహేష్ పక్క గ్రామమైన అలుగునూర్‌కు చెందిన ఎల్‌ఎల్‌బీ విద్యార్థినిని ప్రేమిస్తున్నాడు. కానీ యువతి కుటుంబ సభ్యు లు వ్యతిరేకించడంతో యువతి అతనికి దూరంగా ఉంటోంది. రెండు రోజుల క్రితం స్నేహనగర్‌లో నివసిస్తున్న తన అక్క, బావ ఇంటికి ఆమె వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మహేష్ గురువారం ఉదయం ఇంట్లో ఎవరులేని, యువతి ఒంటరిగా ఉన్నదని గమనించాడు. దీంతో ముందుగా కొనుగోలు చేసిన ఇనుప సుత్తె తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు.

యువతితో ప్రేమ వ్యవహారంపై వాగ్వాదానికి దిగి, ఆగ్రహంతో సుత్తెతో ఆమె తలపై దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని నిందితున్ని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. 

అయితే ఈ ఘటనపై బాధితురాలి బావ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ జీ రాజశేఖర్, చివ్వెంల ఎస్‌ఐ వీ మహేశ్వర్‌తో పాటు క్లూస్ టీం ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.