29 April, 2026 | 10:53 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

గురుకులాల పనివేళలు సవరిస్తాం

20-02-2026 12:00 AM

ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో సెక్రెటరీ హామీ

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్టంలోని సాంఘీక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల పాఠశాలల పనివేళలు ఉపాధ్యాయులు కోరుతున్న విధంగా సవరిస్తామని గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణ అదిత్య హామీ ఇచ్చారు. గురువారం సాంఘీక సంక్షేమ గురుకులాల సొసైటీలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించటానికి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో టీయస్ యూ టీఎఫ్ పక్షాన రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్, సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటి విభాగం నాయకులు ఎల్లయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ...విద్యార్థుల సంక్షేమానికి ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పా రు.

ఉపాధ్యాయుల సమస్యలపై టీఎస్ యూటీఎఫ్ ఇచ్చిన ప్రాతినిధ్యంపై స్పంది స్తూ ప్రమోషన్ ప్రక్రియను త్వరలో చేపడతామని, పాఠశాలల సమయం మార్పు చేయడంతోపాటు రాత్రి విధులు నిర్వహించిన వారికి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు అనుమతించడానికి అంగీకరించారని తెలిపారు. పార్ట్ టైం టీచర్ల వేతనాలు రెండు రోజుల్లో విడుదల చేస్తామని, రెగ్యులర్ ఉపాధ్యాయులకు 010 వేతనాల అమలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.