13 June, 2026 | 9:04 PM

ఉపాధి కూలీలకు రూ.500 వేతనం చెల్లించాలి

13-06-2026 07:46 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ఉపాధి హామీ కూలీలకు రోజుకు ఐదువందల వేతనం చెల్లించాలని ట్రైకార్ మాజీ చైర్మన్ అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం ఆయన ములకలపల్లి మండలం పాతూరు, గుర్రాలగుంట గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు, కూల్‌డ్రింక్స్ పంపిణీ చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా కూలీలకు ఉపశమనం కలిగించేందుకు స్వయంగా వాటిని అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడిన తాటి వెంకటేశ్వర్లు ఉపాధి పనుల నిర్వహణ, వేతనాల చెల్లింపులు,పని దినాలపై ఆరా తీశారు. అలాగే గ్రామ సమస్యలు,రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎండాకాలంలో ఉపాధి కూలీలకు మెడికల్ కిట్లను, టెంట్ లను ఎర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనీసం రూ.500 వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.