7 July, 2026 | 10:19 PM

ఘనంగా మందకృష్ణ జన్మదిన వేడుకలు

07-07-2026 09:05 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంగళవారం మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో మందకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు దూరే వినోద్, స్వప్నల సహకారంతో పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు, పలకలు అందించారు.