7 July, 2026 | 10:18 PM

భువనగిరి సమరభేరి సభను విజయవంతం చేసిన బహుజనులకు కృతజ్ఞతలు

07-07-2026 09:07 PM

- టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట,(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో ఈ నెల 5న భువనగిరిలో నిర్వహించిన 'రాజ్యాధికార సమర భేరి' సభను విజయవంతం చేసిన బహుజన ప్రజలకు, పార్టీ శ్రేణులకు టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

​టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. భువనగిరి సభ భవిష్యత్ పోరాటాలకు దిక్సూచిగా నిలుస్తుందని, భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. సభలో తీసుకున్న తీర్మానాలను గ్రామగ్రామానికి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.​మెజారిటీ వర్గాలకు సామాజిక, ఆర్థిక రాజ్యాధికారం సిద్ధించే వరకు టీఆర్పీ పోరాటం ఆగదని వట్టె జానయ్య స్పష్టం చేశారు.