11 July, 2026 | 3:06 AM

తయారీ రంగానికి తెలంగాణ అనుకూలం: శ్రీధర్‌బాబు

11-07-2026 02:02 AM

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి) : తయారీ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యం త అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే లా జర్మనీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందా న్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరా రు.

బవేరియన్(జర్మనీ) మినిస్ట్రీ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్, రీజినల్ డెవలప్‌మెంట్ అండ్ ఎనర్జీ వైస్ మినిస్టర్ టోబియాస్ గోత్ హర్ట్ నేతృత్వంలోని జర్మనీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయం లో మంత్రి శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ భేటీలో ‘తెలంగాణ జర్మనీ’ మధ్య ద్వైపా క్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు గల అవకాశాలపై చర్చించారు. పారిశ్రామికాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.