11 July, 2026 | 2:59 AM

సత్తుపల్లి నియోజకవర్గం రైతు ఆశీర్వాద సభకు భారీగా తరలివెళ్లిన మహిళలు

11-07-2026 01:57 AM

జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్

సత్తుపల్లి, జూలై 10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రైతు ఆశీర్వాద సభకు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్  ఆధ్వర్యంలో మహిళలు, రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కాంగ్రెస్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం బస్సు ఎక్కి సభకు వెళ్తున్న మహిళలు, రైతులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతు ఆశీర్వాద సభ రైతులకు మరింత భరోసాను కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.