27 June, 2026 | 1:33 AM

ఫామ్ హౌస్ వద్ద యువకుడి మృతి

27-06-2026 12:21 AM

అనుమానాస్పద మృతిగా కేసు 

కరీంనగర్, జూన్ 26 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ పరిధిలోని ’అధర్వ్ రిసార్ట్’ ఈత కొల నులో దుర్శిటి అఖిల్ (21) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. హై దరాబాద్‌లో పనిచేస్తున్న అఖిల్.. స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు రిసార్టుకు రాగా, మరుసటి రోజు ఉదయం శవ మై కనిపించాడు. అఖిల్ స్వస్థలం పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామం.

రెండు నెలల నుంచి హైదరాబాద్ తుక్కుగూడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితుడు ఎలిగేటి అరవింద్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు 9 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు రిసార్టుకు చేరుకున్నారు. అర్థరాత్రి వరకు పార్టీ జరుపుకున్న అనంతరం, ఉద యం చూసేసరికి అఖిల్ ఈత కొలనులో మృతి చెంది ఉన్నాడు. అఖిల్ తండ్రి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. స్నేహితులపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు కొన సాగుతోంది.