15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రూ.కోటి విలువైన పాన్ మసాలా చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్

15-04-2026 12:58 AM

అత్యంత వేగంగా ఛేదించిన ఆలేరు పోలీసులు,

వివరాలను వెల్లడించిన ఆలేరు సీఐ యాలాద్రి..

ఆలేరు, ఏప్రిల్ 14 : ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రవాణా అవుతున్న సుమారు కోటి రూపాయల విలువైన పాన్ మసాలా చోరీకి గురైన కేసును ఆలేరు పోలీసులు అత్యంత వేగంగా ఛేదించి సంబంధిత వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆలేరు సీఐ యాలాద్రి మంగళవారం విలేఖరుల సమావేశంలో  వెల్లడించారు.

నోయిడా నుంచి హైదరాబాద్కు ’బాబా పాన్ మసాలా’ లోడ్తో వస్తున్న ఒక కంటైనర్ ట్రక్కు, ఏప్రిల్ నెల మొదటి వారంలో ఆలేరు సమీపంలో అదృశ్యమైందని న్యూ ఢిల్లీకి చెందిన వినోద్ ఉపాధ్యాయ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో  కేసు నమోదు చేశామన్నారు. అనంత దర్యాప్తు చేస్తున్న క్రమంలో హర్యానాకు చెందిన ట్రక్కు డ్రైవర్ సద్దాం, తన స్నేహితుడైన హైదరాబాద్కు చెందిన సిరాజ్తో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు తేలిందన్నారు.

వీరు ఆలేరు సమీపంలోని హైవే పక్కన ఉన్న ఒక క్రషర్ వద్ద కంటైనర్ను ఆపి, అందులోని 296 కార్టన్ల పాన్ మసాలాను వేరే వాహనంలోకి మార్చారని తెలిపారు. అనంతరం ఆ సరుకును హైదరాబాద్లోని చంచల్గూడ ప్రాంతంలోని ఒక గోదాముకు తరలించి, అక్కడ దాచిపెట్టి విక్రయించాలని పథకం వేయడంతో గోదాముపై దాడి చేసి  233 కార్టన్ల పాన్ మసాలాను పట్టుబడి చేశామన్నారు. దీని విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సద్దాంను రిమాండ్కు తరలించామన్నారు. సిరాజ్ అనే నిందితుడు పరారీలో ఉండగా గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.