ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ
15-07-2026 12:25 AM
- పెద్దపల్లిలో 2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన సతీష్
- ఇంట్లో రూ.32.31 లక్షల నగదు స్వాధీనం
పెద్దపల్లి, జూలై 14 (విజయక్రాంతి): పెద్దపల్లి మున్సిపాలిటీలో రూ.2 లక్షల లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) కల్లేపల్లి సతీష్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కాంట్రాక్టర్ బిల్లును ప్రాసెస్ చేసి టీయూఎఫ్‌ఐడీసీకి పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని స్వీకరి స్తున్న సమయంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నిందితుడి నివాసంలో నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో చూపని రూ.32,31,900 నగదు బయటపడింది. ఈ నగదును అధికారులు స్వాధీనం చేసుకుని, దాని మూలాలపై దర్యాప్తు చేపట్టా రు. నిందితుడిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.






